CBSE 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఫలితాల్లో ‘జవహర్ నవోదయ’ జయకేతనం
పెద్దవూర మండలంలోని చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రకటించిన పది, పన్నెండు తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చినట్లు ప్రిన్సిపల్ ఆర్.నాగభూషణం మంగళవారం తెలిపారు. పదోతరగతిలో 80మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 80 మంది ఉత్తీర్ణత సాధించి వందశాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు. వారిలో 68 మంది విద్యార్థులు డిస్టింక్షన్‌లో, 8మంది ప్రథమ శ్రేణిలో, 4గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్థులైనట్లు వెల్లడించారు. పదోతరగతిలో కుర్ర కృష్ణప్రసాద్ 500మార్కులకు గాను 485మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, పంతంగి అఖిలేష్ 479 మార్కులతో ద్వి తీయ స్థానంలో, బుర్ర శిశిర 477మార్కులు సాధించి తృతీయ స్థానంలోనూ నిలిచినట్లు తెలిపారు. కుర్ర కృష్ణప్రసాద్, బెండల రాంచరణ్‌తేజ్ తెలుగులో వంద మార్కులు సాధించినట్లు తెలిపారు.
Also Read: TS EAPCET 2024 Expected Marks Vs Rank
పన్నెండో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత..
పన్నెండో తరగతిలో 28మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 19మంది విద్యార్థులు డిస్టింక్షన్‌లోనూ, 9 మంది ప్రథమ శ్రేణిలోనూ ఉత్తీర్థత సాధించినట్లు పేర్కొన్నారు. పన్నెండో తరగతిలో అలేటి స్టాలిన్ 500మార్కులకు గాను 455మార్కులతో ప్రథమ స్థానం, రమావత్ మహేందర్ 448మార్కులతో ద్వితీయ, ఎల్క కౌశిక్ 425మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.