Inter Admissions: సీఓఈ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ఇదే..
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 4న నిర్వహించిన మొదటి విడత ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను రెండో విడత పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు. సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్ రీజియన్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి, బెల్లంపల్లి సీఓఈ కళాశాల ప్రిన్సిపాల్ సైదులు తెలిపారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
బాలబాలికల కోసం రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, చెన్నూర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. అనుమానాల నివృత్తి, ఇతర వివరాల కోసం 9948714105 నంబరులో సంప్రదించాలని సూచించారు.