PG Semester Examinations: నేటి నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు..
Sakshi Education
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడివరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం పుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) శనివారం నుంచి జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య శుక్రవారం తెలిపారు.
PG Semester Examinations
ఈ నెల 25, 27, 29, 31, ఫిబ్రవరి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 26 సెంటర్లను ఏర్పాటుచేయగా, 4,770 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.