Skip to main content

AMC 2023: ఆంధ్ర వైద్య కళాశాలలో అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే..

మహారాణిపేట : ఆంధ్ర వైద్య కళాశాల (ఏఎంసీ)లో అడ్మిషన్ల సందడి నెలకొంది. ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే వేళ సీట్లు కూడా పెరగడంతో ఉత్సాహంగా ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఆంధ్ర వైద్య కళాశాల
ఆంధ్ర వైద్య కళాశాల

ఈ అడ్మిషన్లలో అఖిల భారత కోటా, రాష్ట్ర కోటాలో సీట్లు భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌, సీట్ల భర్తీకి తేదీలు ఖరారు చేశారు. నాలుగు విడతల్లో మొత్తం సీట్లు భర్తీ చేయడానికి వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ, వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పాట్లు చేసింది.

Also read: Nursing Job : నర్సింగ్‌ ట్యూటర్స్‌గా ప్రమోషన్లు

  • ఎంబీబీఎస్‌లో మొత్తం 250 సీట్ల కోసం నాలుగు విడతల్లో కౌన్సెలింగ్‌, అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. అఖిల భారత కోటాలో కేటాయించిన 15 శాతం సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్‌, భర్తీకి ఆగస్టు 4 చివరి తేదీగా నిర్ణయించారు. స్టేట్‌ కోటాలో 85 శాతం సీట్లకు తొలి విడత కౌన్సెలింగ్‌, భర్తీకి ఆగస్టు 8 చివరి తేదీగా నిర్ణయించారు
  • రెండో విడత కౌన్సెలింగ్‌, భర్తీకి అఖిల భారత కోటాకు ఆగస్టు 28, స్టేట్‌ కోటాకు సెప్టెంబర్‌ 4 చివరి తేదీగా నిర్ణయించారు.
  • మూడో విడత కౌన్సెలింగ్‌, భర్తీకి అఖిల భారత కోటాకు సెప్టెంబర్‌ 18, స్టేట్‌ కోటాకు సెప్టెంబర్‌ 21 చివరి తేదీగా నిర్ణయించారు.
  • నాలుగో విడత కౌన్సెలింగ్‌, భర్తీకి అఖిల భారత, స్టేట్‌ కోటాలకు సెప్టెంబర్‌ 30 చివరి తేదీగా నిర్ణయించారు. అనంతరం తరగతులు ప్రారంభం అవుతాయి.

Also read: 6329 Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా‌..#sakshieducation

పెండింగ్‌లో 48 బ్రాడ్‌ స్పెషాలిటీ సీట్లు

ప్రస్తుతం పీజీ సీట్లు 237 సీట్లు ఉండగా, ఈ ఏడాది అదనంగా 131 సీట్లు పెరిగాయి. పెరిగిన సీట్లలో ఎండ్రో కై నాలజీలో ఉన్న రెండు సీట్లకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంపీ) బృందం ఇంకా తనిఖీ చేయలేదు. దీంతో పెరిగిన 131లో 129 సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అంటే ప్రస్తుతం 237 సీట్లు, 129 సీట్లు మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు ఇందులోని బ్రాడ్‌ స్పెషాలిటీస్‌ సీట్లకు ప్రస్తుతం కౌన్సెలింగ్‌, భర్తీ చేయడం లేదని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీట్లలో 25, పెరిగిన వాటిలో 23 బ్రాడ్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయని, మొత్తం 48 సీట్లు పెండింగ్‌లో ఉంటాయని వివరించారు.

Also read: Acharya NG Ranga Agricultural University: ఫుడ్‌ టెక్నాలజీతో అపార అవకాశాలు

ఇప్పడు 318 సీట్లు మాత్రమే భర్తీ చేస్తున్నామని వివరించారు. వీటిలో 50 శాతం అఖిల భారత స్థాయి కోటా, మరో 50 శాతం స్టేట్‌ గవర్నమెంటు కోటాతో భర్తీ చేస్తున్నారు.

  • తొలి విడతలో అఖిల భారత కోటలో కేటాయించిన 50 శాతం సీట్లకు కౌన్సెలింగ్‌, భర్తీకి ఆగస్టు 16, స్టేట్‌ కౌన్సెలింగ్‌లో 50 శాతం సీట్లకు ఆగస్టు 21 చివరి తేదీగా నిర్ణయించారు.
  •  రెండో విడతలో అఖిల భారత కోటాలో కేటాయించిన సీట్లకు సెప్టెంబర్‌ 4, స్టేట్‌ కోటాలో కేటాయించిన సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 11 చివరి తేదిగా నిర్ణయించారు.
  • మూడో విడతలో అఖిల భారత కోటాలో కేటాయించిన సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 25, స్టేట్‌ కోటాలో కేటాయించిన సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 30 చివరి తేదీగా నిర్ణయించారు
  • నాలుగో విడతలో అఖిల భారత, స్టేట్‌ కోటాలో కేటాయించిన సీట్లకు కౌన్సెలింగ్‌, భర్తీకి అక్టోబర్‌ 10 చివరి తేదీగా నిర్ణయించారు.

Also read: NEET – 2023: డాక్టర్‌ కావాలంటే నిత్య విద్యార్థి కావాలి.. వైస్‌ చాన్సలర్‌ కోరుకొండ బాబ్జీ

  1. ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
  2. మొత్తం నాలుగు విడతల్లో కౌన్సెలింగ్‌

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 4న ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల తొలి విడత కౌన్సెలింగ్‌, భర్తీ ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమయ్యే అధికారులు, సిబ్బందిని నియమించాం. ఈ ఏడాది ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా పీజీ సీట్లు పెరగడం, వాటికి అనుమతులు రావడం ఎంతో సంతోషంగా ఉంది.

– డాక్టర్‌ జి.బుచ్చిరాజు,ప్రిన్సిపాల్‌, ఆంధ్ర వైద్య కళాశాల

 

Also read: Hidden Talent: బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌.. నెటిజన్లు ఫిదా..!

Published date : 31 Jul 2023 03:11PM

Photo Stories