Skip to main content

Hidden Talent: బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌.. నెటిజన్లు ఫిదా..!

సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.
నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌
నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌

పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్‌ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్‌ను గురి చూసి కొడుతున్నాడు. 

Also read: Employees: నైపుణ్యాభివృద్ధిలో హెచ్‌ఆర్‌ కీలకం

దూరంలో ఉన్న లక్ష‍్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు.  ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Also read: Nursing Job : నర్సింగ్‌ ట్యూటర్స్‌గా ప్రమోషన్లు

Also read: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష‍్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన‍్నోడు టాలెంట్ చూసేయండి.

Published date : 29 Jul 2023 06:28PM

Photo Stories