Skip to main content

Bhukya Ramesh: చంద్రయాన్‌–3లో సోమ్లతండా వాసి

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలం సోమ్లతండా గ్రామానికి చెందిన భూక్య రమేష్‌ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
Bhukya Ramesh
శాస్త్రవేత్త భూక్య రమేష్‌

 చంద్రయాన్‌–3 ప్రయోగం సందర్భంగా ఇస్రోలోని ప్రధాన శాస్త్రవేత్తలతో కలిసి రమేష్‌ కూడా పాల్గొన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భూక్య భీముడు, లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు అయిన రమేష్‌ ఇస్రోలో నాలుగేళ్లుగా కమ్యూనికేషన్‌ విభాగంలో పని చేస్తున్నారు.

చదవండి: Chandrayaan-3 Success : చంద్రయాన్-3 సూప‌ర్ స‌క్సెస్‌.. ఇక వాట్ నెక్ట్స్.. దీని వ‌ల్ల మానవాళికి ఏం లాభం అంటే..?

చంద్రయాన్‌ 2, చంద్రయాన్‌ 3 ప్రయోగం సమయంలో ఇక్కడే ఉండడం తనకు ఎంతో గర్వంగా ఉందని రమేష్‌ చెప్పారు. ఈసారి విజయవంతం కావడం భారత దేశ ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు.

చదవండి: Chandrayaan-3: ఆ న‌లుగురు... చంద్రయాన్-3 స‌క్సెస్ వెన‌క ఉన్న‌ది వీరే

Published date : 24 Aug 2023 03:05PM

Photo Stories