Chandrayaan 3 Success: అద్వితీయ ఘట్టం.. విద్యార్థులతో కలిసి వీక్షించిన కలెక్టర్
ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటల ప్రాంతంలో చందమామను చంద్రయాన్ ముద్దాడడంతో జయహో భా రత్.. మేరా భారత్ మహాన్ నినాదాలు మార్మోగా యి. సాయంత్రం 5 తర్వాత అపురూప ఘట్టం వీక్షించేందుకు జనం టీవీలు, ప్రొజెక్టర్లకు అతుక్కుపోయారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–3 ల్యాండింగ్ విజయవంతం కావడంతో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల జా తీయ జెండాలు చేతపట్టుకొని విద్యార్థులు, యువత నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగితేలారు.
చదవండి: Chandrayaan-3: ఆ నలుగురు... చంద్రయాన్-3 సక్సెస్ వెనక ఉన్నది వీరే
విద్యార్థులతో కలిసి వీక్షించిన కలెక్టర్..
జాబిల్లిపై చంద్రయాన్–3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసా రం వీక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యే క ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడ మైనార్టీ రెసిడెన్షియల్‌లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్, డీఈవో ప్రణీత ప్రొజెక్టర్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు.
విజయవంతమైన తర్వాత కలెక్టర్‌కు విద్యార్థులు మిఠాయిలు తినిపించారు. కేరింతలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రయాన్–3 విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. భావితర శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.