Mega Job Fair: ఐటీ హబ్‌లో ఉద్యోగాలకు 1న జాబ్ మేళా
Sakshi Education
నల్లగొండ : నల్లగొండలోని ఐటీ హబ్‌లో ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 1న పట్టణంలో లక్ష్మి గార్డెన్‌లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో శ్రీమెగా జాబ్ మేళ్ఙా నిర్వహిస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు.
ఆగస్టు 25న కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈ విజయ రంగినేని, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డితో కలిసి జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 14 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. స్థానిక యువత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నల్లగొండలో రూ.98 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌లో 15 కంపెనీలు తమ బ్రాంచీల ఏర్పాటుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఐటీ హబ్‌ను సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో టాస్క్ నల్లగొండ క్లస్టర్ మేనేజర్ జి.సుధీర్, ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 26 Aug 2023 03:17PM