Skip to main content

10,105 Jobs: పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌.. ఉద్యోగాల వివరాలు ఇలా..

రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జూన్‌ 17న ఉత్తర్వులు జారీ చేశారు.
10,105 Jobs
10,105 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

శాఖల వారీగా జీవో నంబర్‌ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈసారి అనుమతి ఇచ్చిన వాటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకు లాల్లోనే ఉన్నాయి. ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను TSPSC ద్వారా, మరో 14 పోస్టులను DSC ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని జూన్‌ 17న తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

చదవండి: 

శాఖ

ఉద్యోగాల సంఖ్య

భర్తీ చేసే సంస్థ

మహిళా, శిశు సంక్షేమం

14

డీఎస్సీ

మహిళా, శిశు సంక్షేమం

251

టీఎస్‌పీఎస్సీ

వికలాంగ, వృద్ధుల శాఖ

71

టీఎస్‌పీఎస్సీ

జువెనైల్‌ వెల్ఫేర్‌

66

టీఎస్‌పీఎస్సీ

మైనార్టీ గురుకులాలు

1,445

టీఆర్‌ఈఐఆర్‌బీ

బీసీ గురుకులాలు

3,870

టీఆర్‌ఈఐఆర్‌బీ

బీసీ సంక్షేమ శాఖ

157

టీఎస్‌పీఎస్సీ

ట్రైకార్‌

1

టీఎస్‌పీఎస్సీ

గిరిజన సహకార సంస్థ

15

టీఎస్‌పీఎస్సీ

గిరిజన సంక్షేమ శాఖ

24

టీఎస్‌పీఎస్సీ

ట్రైబల్‌ గురుకులాలు

1,514

టీఆర్‌ఈఐఆర్‌బీ

టీసీఆర్‌టీఐ

16

టీఎస్‌పీఎస్సీ

గిరిజన సంక్షేమ శాఖ

78

టీఎస్‌పీఎస్సీ

టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ

2,267

టీఆర్‌ఈఐఆర్‌బీ

దళిత అభివృద్ధి శాఖ

316

టీఎస్‌పీఎస్సీ

Published date : 18 Jun 2022 04:49PM

Photo Stories