Skip to main content

Andhra Pradesh: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. కీలకమైన‌ ఫైల్‌పై సీఎం జగన్‌ సంతకం..

సాక్షి, తాడేపల్లి: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్దులకు తీపికబురు అందించింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
AP CM YS Jagan Mohan Reddy

అభ్యర్థులందరికీ న్యాయం చేసే ఫైల్ మీద సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు. ఈ మేరకు వారికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వారికి(98 డీఎస్సీ అభ్యర్థులు) ప్రభుత్వం న్యాయం చేయనుందని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తెలిపారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న 98 DSC ఫైల్ పై సీఎం జగన్‌ సంతకం చేశారు. ఇరవై ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉంది. ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. సీఎం జగన్‌ న్యాయం చేస్తారని నమ్మి వాళ్ళు విన్నవించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

AP TET Notification : ఏపీ టెట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ నిబంధనల ప్రకారమే..?

తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు..
గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 98, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగలేదు. 2008 డీఎస్సీ అభ్యర్థుకుల  కూడా సీఎం జగన్‌ న్యాయం చేశారు. తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుంది. త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి...విధివిధానాలు రూపొందిస్తున్నారు అని ఎమ్మెల్సీ వెల్లడించారు.

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

AP TET 2022 : టెట్‌ను సులువుగా కొట్టే స‌రైన‌ మార్గాలు ఇవే..|బెస్ట్ బుక్స్ ఇవే..|సిల‌బ‌స్ ఇదే..

Published date : 17 Jun 2022 07:13PM

Photo Stories