Skip to main content

AP TET 2022 : టెట్‌ను సులువుగా కొట్టే స‌రైన‌ మార్గాలు ఇవే..|బెస్ట్ బుక్స్ ఇవే..|సిల‌బ‌స్ ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2022( AP TET )ను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశా జూన్‌ 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు జూన్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు TET రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. జూన్‌ 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. ‘https://cse.ap.gov.in’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులకు సహకరించేందుకు జూన్‌ 13 నుంచి విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్‌ డెస్కును ఏర్పాటు చేస్తున్నారు. జూలై 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ Mock Tests నిర్వహిస్తారు. జూలై 25 నుంచి Halltickets జారీ చేస్తారు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తును నింపిన తర్వాత అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకొని సబ్మిట్‌ చేయాలి. TET Syllabusను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్‌ బులెటిన్ లో పొందుపరిచింది. ఈ నేప‌థ్యంలో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ ( www.sakshieducation.com ) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు డా.మోజెస్ గారిచే ఏపీ టెట్ సిల‌బ‌స్, బెస్ట్ బుక్స్‌, నోటిఫికేష‌న్ వివ‌రాలు,  ప్రిప‌రేష‌న్ టిప్స్ మొద‌లైన ముఖ్య‌మైన అంశాల గురించి ఈ వీడియో ద్వారా వివ‌రించారు.

Photo Stories