Skip to main content

AP TET Notification : ఏపీ టెట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఈ నిబంధనల ప్రకారమే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్ 10వ తేదీన (శుక్రవారం) విడుదల చేయ‌నున్నారు.
AP TET Notification
AP TET Notification 2022

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్ జూన్ 9వ తేదీ (గురువారం) ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం తదితర వివరాలకు ' http://aptet.apcfss.in ' వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు జూన్ 10వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 నుంచి ఈ వెబ్‌సైట్‌ నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

TET Exam 2022: ఏ పుస్తకాలు చదవాలి!!

ఈ నిబంధనల ప్రకారమే..
టెట్‌ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహించాల్సినా గత సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్‌ ఎలిజిబులిటీ కమ్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టెట్‌ కమ్‌ టెర్ట్‌) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్‌ నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది.

TS TET 2022లో Child development విభాగం ఎలా చదవాలి?

డీఎస్సీలో 20 శాతం వెయిటేజీతో..
దీర్ఘకాలంగా టెట్‌ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్‌ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

టెట్ ప్రిపరేషన్ గైడెన్స్

ప‌రీక్ష విధానం, సిలబస్ ఇలా..
టెట్‌ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్‌సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్‌ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు.

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే..
☛ రెగ్యులర్‌ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1ఏలో అర్హత సాధించాలి.
☛ దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూళ్లలో 1 – 5  తరగతులు బోధించాలంటే పేపర్‌ 1బీలో అర్హత తప్పనిసరి.
☛ రెగ్యులర్‌ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
☛ టెట్‌లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్‌ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

 డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పరీక్ష విధానం ఇలా..?

పేపర్‌ 1ఏ, 1 బీ

పాఠ్యాంశం

ప్రశ్నలు

మార్కులు

ఛైల్డ్‌ డెవలప్‌మెంటు, పెడగాగి

30

30

లాంగ్వేజ్‌–1

30

30

లాంగ్వేజ్‌–2

30

30

మేథమేటిక్స్‌

30

30

ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌

30

30

పేపర్‌ 2ఏ

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాగి

30

30

లాంగ్వేజ్‌ 1

30

30

లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌)

30

30

మేథమెటిక్స్, సైన్సు, సోషల్‌స్టడీస్, లాంగ్వేజెస్‌

60

60

పేపర్‌ 2బీ

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాగి

30

30

లాంగ్వేజ్‌ 1

30

30

లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌)

30

30

డిజేబులిటీ స్పెషలైజేషన్, పెడగాగి

60

60

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

Published date : 10 Jun 2022 11:42AM

Photo Stories