1,326 Jobs: డాక్టర్ కొలువులు.. జోన్ల వారీగా పోస్టుల సంఖ్య ఇలా..
మొత్తం 1,326 పోస్టులను భర్తీ చేయ నున్నారు. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో 357 ట్యూటర్ పోస్టులను భర్తీ చేస్తారు. వీరికి రూ. 57,700 నుంచి రూ.1,82,400 (UGC) స్కేల్ ఖరారు చేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 751 Civil Assistant Surgeon, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 Civil Assistant Surgeon/General Duty Medical Officer, ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మూడు కేటగి రీలకు రూ. 58,850 నుంచి రూ.1,37,050 స్కేల్ ఆఫ్ పేను ఖరారు చేశారు. 18–44 ఏళ్ల మధ్య వయస్సు వారు ఈ పోస్టులకు అర్హులు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. వీరెవరూ కూడా ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అర్హులు కాదని బోర్డు స్పష్టం చేసింది. జూలై 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బోర్డు వెబ్‌సైట్ (https://mhsrb.telangana.gov.in) లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లోని కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ అభ్యర్థులు అనుభవ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు వీలుగా నెల రోజుల గడువు ఇచ్చినట్లు అధికా>రులు తెలిపారు.
చదవండి:
- Junior Resident Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 194 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
- Department of Health: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ
- Department of Medical Health: ప్రభుత్వ వైద్యులకు ఈ ప్రాక్టీస్‌పై నిషేధం
పాయింట్ల ఆధారంగా ఎంపిక
అభ్యర్థులను వంద పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. MBBS పరీక్షలకు 80 పాయింట్లు, కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీకి గరిష్టంగా 20 పాయింట్లు కేటాయించారు. ఇవన్నీ మల్టీజోనల్ పోస్ట్‌లు. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు సందర్భంగా ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ.200 రుసుము చెల్లించాలి. ఎగ్జామినేషన్ ఫీజు అధనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యోగులు, డిక్లరేషన్ సమర్పించే నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలు...
- కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ అభ్యర్థులు గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున ఇస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో చేసిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. ఆరు నెలలు పూర్తయిన వారికే పాయింట్లు ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు అనుభవ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు చేసుకుంటున్న పోస్టుల ప్రాధాన్యతలను వరసగా రాయాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌లను అనుసరించి ప్రాధాన్యత క్రమంలో వారి మెరిట్, పోస్ట్‌కి వారి అర్హత ప్రకారం ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
- దరఖాస్తు సందర్భంగా ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, ఏకీకృత ఎంబీబీఎస్ మార్కుల మెమో, ఎంబీబీఎస్ సర్టిఫికెట్, ఎఫ్‌ఎంజీఈ పరీక్ష మార్కుల మెమో, సర్టిఫికెట్, విదేశాలలో అర్హత పరీక్ష, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, స్థానికతను తెలియజేస స్టడీ సర్టిఫికెట్లు (1 నుండి 7వ తరగతి) జత చేయాలి.
- దరఖాస్తుదారుల వయస్సును జూలై 1. 2022 తేదీతో లెక్కిస్తారు.
- దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్‌లను సమర్పించాలి. లేకుంటే అనర్హతగా ప్రకటిస్తారు.
- అర్హులైన వికలాంగ మహిళా దరఖాస్తుదారులు అందుబాటులో లేకుంటే, పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
- ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు.
జోన్ల వారీగా పోస్టుల సంఖ్య
పోస్టులు |
జోన్–1 |
జోన్–2 |
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (డీహెచ్) |
466 |
285 |
ట్యూటర్లు (డీఎంఈ) |
200 |
157 |
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు/ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు |
131 |
80 |
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (ఐపీఎం) |
01 |
06 |