నల్లగొండ: వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆగస్టు 4న నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలో అప్రెంటిషిప్ కం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ దస్రూ నాయక్ ఆగస్టు 3న ఒక ప్రకటనలో తెలిపారు.
అప్రెంటిషిప్ కం జాబ్‌మేళా
2021–2023 విద్యాసంవత్సరంలో పాసైన విద్యార్థులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. అప్రెంటిషిప్‌నకు ఎంపికై న వారికి ఉపకార వేతనం అందించబడుతుందని, తర్వాత ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. జాబ్‌మేళాలో ఎంపికై న వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పూర్తి బయోడేటా, సర్టిఫికెట్లతో ఉదయం 9గంటలలోపు హాజరు కావాలని కోరారు.