Skip to main content

Job Mela: ప‌లు పోస్టులకు అప్రెంటిస్‌ మేళా

విజయనగరం రూరల్‌: హైదరాబాద్‌లోనీ మేధో సర్వే డ్రైవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అప్రెంటిస్‌ నియామకాలకు ఆగ‌స్టు 4న మేళా నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ టీవీ గిరి ఆగ‌స్టు 2న‌ తెలిపారు.
Job Mela
ప‌లు పోస్టులకు అప్రెంటిస్‌ మేళా

జిల్లా కేంద్రంలోని వీటీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే అప్రెంటిస్‌ మేళాకు వివిధ ట్రేడ్‌లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. ఎలక్ట్రీషియన్‌ 300, ఫిట్టర్‌ 300, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 100, వెల్డర్‌ 25 పోస్టులకు అప్రెంటిస్‌కు ఎంపిక చేస్తారని తెలిపారు.

చదవండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

శిక్షణ కాలంలో స్టైపెండ్‌ నెలకు రూ.13500, ఈఎస్‌ఐ, ఓటీ, యూనిఫాం, షూ ఇస్తారని చెప్పారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫారం, 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుతో అప్రెంటిస్‌ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9849944654, 8985054780 నంబర్లను సంప్రదించాలని వివరించారు.

Published date : 03 Aug 2023 03:10PM

Photo Stories