Data Science: హ్యాకథాన్ ప్రారంభం
ఇండో యూరో సింక్ అండ్ జర్మన్ యూనివర్సిటీతో కలిసి 12 నెలలపాటు ఈ పోటీని నిర్వహించనున్నట్లు APSSDC ఎండీ, సీఈవో ఎస్.సత్యనా రాయణ తెలిపారు. జూలై 28న APSSDC డీసీ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి హ్యాకథాన్‌కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్య నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులు దీన్ని వినియోగించుకొని.. అంతర్జాతీయంగా తమ సత్తా చాటాలన్నారు. అజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. 2021లో నిర్వ హించిన పోటీల్లో 1,200 మంది పాల్గొన్నా రని, 2022 లో 3,000 మంది వరకు పాల్గొంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Robotics, Artificial Intelligence తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
చదవండి: