Skip to main content

రోబోటిక్స్ విద్య వైపు.. విద్యార్థుల చూపు

నేటి యువత రోబోటిక్స్ కెరీర్‌పై ఆసక్తి చూపుతోంది. కమాండ్ కంట్రోల్‌తో పనిచేసే ఈ రోబోటిక్స్ యంత్రాలు అన్ని రంగాలకు విస్తరిస్తుండమే అందుకు కారణం.
పారిశ్రామిక రంగం, డిజైనింగ్, నిర్మాణం, ఆటోమొబైల్, అగ్రికల్చర్, అంతరిక్ష ప్రయోగాలుసహా అనేక రంగాల్లో రోబోటిక్స్ ప్రమేయం పెరుగుతోంది. బాంబులు, విస్ఫోటనాలు, మైనింగ్ కార్యకలాపాలు ఊపందుకున్న క్రమంలో... 21వ శతాబ్దం ఆగమనంతో రోబోల పాత్ర కీలకంగా మారింది. రానున్న రోజుల్లో రోబోలు మరింతగా మానవ దైనందిన జీవితంలో విడదీయరాని భాగం అవుతాయని అంచనా! ఈ నేపథ్యంలో.. అప్‌కమింగ్ కెరీర్ రోబొటిక్‌పై ప్రత్యేక కథనం...

ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్స్ ప్రమేయం వాయు వేగంతో విస్తరిస్తోంది. ప్రస్తుతానికి భారత్‌లో ఆ స్థాయిలో రోబోల విస్తరణ లేదనే చెప్పాలి. అయితే క్రమేణా అన్ని రంగాల్లో రోబోల ప్రవేశం పెరుగుతోంది. వేగం, కచ్చితత్వం, నాణ్యత దృష్ట్యా కంపెనీలు రోబోటిక్స్ టెక్నాలజీ వినియోగానికి ఆసక్తి చూపుతున్నాయి. దాంతో భవిష్యత్‌లో రోబోటిక్స్ నైపుణ్యాలున్న వారికి మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోబో కోర్సులు :
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్/10+2 తర్వాత రోబోటిక్స్ ఇంజనీరింగ్‌లో చేరే వీలుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సుల తర్వాత ఎంటెక్‌లో రోబోటిక్స్ స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ అలహాబాద్‌ల్లో పీజీ స్థాయిలో రోబోటిక్స్ చదివే అవకాశం ఉంది.

కొలువులెక్కడ ?
రోబోటిక్స్ కోర్సులు చదివిన అభ్యర్థులు రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ, ఆటోమొబైల్ కంపె నీలు, అంతరిక్ష రంగంలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్యాకేజింగ్, టెస్టింగ్, ఇన్స్‌పెక్టింగ్, అసెంబ్లింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ సంస్థలు బీహెచ్‌ఈఎల్, బార్క్, ఇస్రో, డీఆర్‌డీ వోలు రోబోటిక్స్ ఇంజనీర్లను నియమించుకుంటు న్నాయి. వీటితోపాటు ఇంటెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇర్విన్ టాయ్, హాట్ వీల్స్ వంటివి రోబోటిక్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్, చైనాల్లో రోబోటిక్స్ నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.

జాబ్ ప్రొఫైల్స్ :
ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక కొంత అనుభవం, నైపుణ్యంతో... రోబోటిక్స్ టెక్నిషియన్స్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీ ర్స్, రోబోటిక్స్ సిస్టమ్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ స్పెషలిస్ట్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్, ఆటోమే టెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చరల్ ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజనీర్ వంటి జాబ్స్ లభిస్తాయి.

డిమాండ్, సప్లై గ్యాప్ :
రోబోటిక్స్ ఉద్యోగాల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(ఎస్‌టీఈఎం -స్టెమ్) నేపథ్యం కలిగిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధా న్యం లభిస్తోంది. రోబోటిక్స్ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు సంబంధించి 200 శాతం వృద్ధి కొనసాగుతుంది. రోబోటిక్స్ సంబంధించిన వృద్ధి ఇలాగే కొనసాగితే మానవ వనరుల పరంగా డిమాండ్, సప్లైకి మధ్య గ్యాప్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి పాఠశాల స్థాయి నుంచే రోబోటిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చేర్చి విద్యార్థులకు రోబోస్‌పై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

అటల్ టింకరింగ్ ల్యాబ్ :
భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడంలో రోబోటిక్స్ యాంత్రిక కొరత అడ్డంకిగా మారనుం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి దేశంలో విద్యా విధానంలో మార్పు చేసి రోబో టిక్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలను పాఠశాల స్థాయి నుంచే పరిశోధనల వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను(ఏటీఎల్)లను ప్రారంభించింది. ముఖ్యంగా రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్ బోర్డ్స్, త్రీడి ప్రింటింగ్ సెన్సార్లతో కూడిన కిట్లను ఏటిఎల్ ద్వారా విద్యార్థులకు అందిస్తుంది. ఇది సైన్‌‌స, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(ఎస్‌టీఈఎం- స్టెమ్) సబ్జెక్ట్‌లపై పరిశోధనల దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది.
Published date : 04 Sep 2019 06:22PM

Photo Stories