Technology: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ప్రస్తుత అవసరం
ఏఐ అంటే ఏమిటీ?
కంప్యూటర్లు ప్రాథమికంగా కృతిమ మేధస్సు ద్వారా మానవ మేధస్సు ప్రక్రియలను అనుకరిస్తాయి. నిపుణుల వ్యవస్థలు, సహజ భాషా ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నిషన్ అండ్ మెషిన్ విజన్ వంటి ఏఐ నిర్దిష్ట ఉపయోగాలు.
ఏఐ ఎందుకు?
ఒక పనికి సంబంధించి మానవులు ప్రదర్శించే సామర్థ్యాలను మరింత ప్రభావవంతంగా, సమర్థవంతంగా ప్రదర్శిస్తుంది ఏఐ సాంకేతిక. సాఫ్ట్‌వేర్ తార్కిక ఆలోచనతో, ఒక ప్రణాళిక ప్రకారం కమ్యూనికేషన్, అవగాహనతో ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సేవలను తక్కువ ఖర్చుతో పొందే అవకాశం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహిస్తున్న డేటాలోని నమూనాలు వంటి సాధారణ విశ్లేషణాత్మక కార్యకలాపాలు కూడా ఇప్పుడు ఏఐ సాంకేతికతో చాలా సులభంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
Science & Technology
అది ఎలా పనిచేస్తుంది
వేగవంతమైన పునరావృత ప్రాసెసింగ్ అండ్ అధునాతన అల్గోరిథంలతో డేటాలోని భారీ వాల్యూమ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా ఏఐ పనిచేస్తుంది. ఇది డేటాలోని నమూనాలు లేదా లక్షణాల నుంచి స్వయంచాలకంగా తెలుసుకోవడానికి ప్రోగ్రామ్‌ను అనుమతిస్తుంది. ఏఐ అనేది అనేక ఆలోచనలు, పద్ధతులు, అనేక ప్రధాన ఉప క్షేత్రాలు, మరియు సాంకేతికతను కలిగి ఉన్న పరిశోధనా రంగం. ఉదా. ఏఐతో తయారు చేసిన జూదం లాంటి అప్లికేషన్లు మానవులతో సమానంగా లేదా మెరుగ్గా పనిచేయగల సాంకేతికత.
నాలెడ్జ్ రిప్రజెంటేషన్
ఏఐలోని నాలెడ్జ్ రిప్రజెంటేషన్ జ్ఞానం ప్రాతినిధ్యాన్ని గురించి వివరిస్తుంది. ఇది ఒక ఏజెంట్ కోసం తెలివైన మానవ ప్రవర్తనను అనుకరించడం ఏఐ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి.
నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ)
ఎన్‌ఎల్‌పీ అనేది ప్రసంగంతో సహా మానవ భాషను విశ్లేషించడానికి, గ్రహించడానికి అలాగే ఉత్పత్తి చేయడానికి కంప్యూటర్ల సామర్థ్యాన్ని సూచిస్తుంది. సహజ భాషా పరస్పర చర్చ అనేది ఎన్‌ఎల్‌పీ తర్వాతి స్థాయి. ఇది సాధారణ, రోజువారీ భాషను ఉపయోగించి.. పనులను అమలు చేయడానికి మానవులను కంప్యూటర్‌లతో అనుసంధానం చేయడానికి పనిచేస్తుంది.
అధునాతన అల్గోరిథంలు
పెద్ద మొత్తంలో వచ్చే డేటా వేగంగా వివిధ స్థాయిలలో మూల్యంకనం చేయడానికి, అధునాతన అల్గారిథమ్‌లను సృష్టించి, ఆసక్తికరమైన మార్గాల్లో వీటిని జతచేయడం జరగుతుంది. అసాధారణంగా జరిగే సంఘటనలను కనుగొనడం, అంచనా వేయడం, సంక్షిష్టమైన పరిస్థితులను అర్థం చేసుకోవడంతోపాటు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ఈ ఆధునిక సాంకేతికత కీలకం
–డా.బి.నరేంద్ర కుమార్‌రావు, పీహెచ్‌డీ
చదవండి: Science Technology Study Material