Free Employment Courses : ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ.. వీరే అర్హులు..
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని స్కిల్ హబ్‌లో యువతీ యువకులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సుకు పదో తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Tenth Students : విజయవాడ రాజ్ భవన్‌కు పదో తరగతి విద్యార్థుల ఆహ్వానం..
హ్యాండ్ ఎంబ్రాయిడరీ(మగ్గం వర్క్)లో చేరడానికి కనీసం 8వ తరగతి విద్యార్హత కలిగిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సుల్లో చేరడానికి 45 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉందన్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సు 6 నెలలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ(మగ్గం వర్క్) కోర్సులో 3 నెలలు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 20 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. వివరాలకు 72870 69457 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Students Scholarships : విద్యార్థుల ప్రోత్సాహానికి విద్యా జ్యోతి స్కాలర్‌షిప్‌లు..