Skip to main content

Job Offers : శ్రీసిటీ అల్స్టమ్‌లో ఉద్యోగావకాశాలు.. అర్హులు వీరే..

ప‌లు విద్యార్హ‌త‌ల‌తో శ్రీసిటీ అల్స్టమ్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు ప్ర‌క‌టించారు..
AP State Skill Development Institute Recruitment Announcement  Salary Rs.2,55,000 per year with Rs.50,000 Site Allowance  Trainee Job Opportunities at Sricity Alstom with ITI Qualification  Job Opportunity for Diploma and ITI Graduates in Sricity Alstom

రాజమహేంద్రవరం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, తిరుపతి శ్రీసిటీ అల్స్టమ్‌ ఆధ్వర్యంలో డిప్లొమా– మెకానికల్‌, ఈసీఈ, ఈఈఈ, ఆటో మొబైల్‌తో పాటు, ఐటీఐ చదివిన వారికి శ్రీసిటీ అల్స్టమ్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల వయసు 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలన్నారు. జీతం ఏడాదికి రూ.2,55,000, సైట్‌ అలవెన్స్‌ రూ.50 వేలు ఉందన్నారు.

Govt and Private ITI Counselling : ప్ర‌భుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చేరేందుకు ఈ రెండు రోజులు కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌..

బెనిఫిట్స్‌–ఫ్రీ ఫుడ్‌ అండ్‌ ట్రాన్స్పోర్టేషన్‌, 14 రోజుల వసతి సౌకర్యం ఉంటుందన్నారు. అదే విధంగా రూ.6 లక్షల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇస్తారన్నారు. 45 రోజుల పాటు ట్రైనింగ్‌ ఉంటుందని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://forms.gle/iSYZZSk8Hb16DmoH7 వెబ్‌సైట్‌లో ఈ నెల 28వ తేదీలోగా వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డిస్ట్రిక్ట్‌ ప్లేస్మెంట్‌ ఆఫీసర్‌ ప్రియ 73967 40041, టోల్‌ ఫ్రీ నంబర్‌ 99888 53335లో సంప్రదించాలని కోరారు.

Group 1 Prelims OMR Sheets: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ స్కాన్డ్‌ ఓఎంఆర్‌ షీట్లు సిద్ధం

Published date : 22 Jun 2024 12:55PM

Photo Stories