Skip to main content

Govt and Private ITI Counselling : ప్ర‌భుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చేరేందుకు ఈ రెండు రోజులు కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌..

ఐటీఐ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశం పొందేందుకు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వ‌హింస్తున్న కౌన్సెలింగ్‌కు విద్యార్థులు వెంట తీసుకురావాల్సిన స‌ర్టిఫికెట్ల గురించి అధికారులు వివ‌రించారు..
Candidates applying to government and private ITIs  Counselling for students to join in Govt and Private ITI Colleges  Rajamahendravaram Government ITI  Counseling session for ITI applicants

రాజమహేంద్రవరం: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24, 25 తేదీల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) ప్రిన్సిపాల్‌ ఎల్‌.ఆర్‌.ఆర్‌.క్రిష్ణన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అయిన అభ్యర్థులు పదవతరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ సర్టిఫికెట్‌, కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్‌తో పాటు ఒక జత జిరాక్స్‌కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.

Protest Over NEET Issue: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి 'నీట్‌' సెగ.. నివాసం వద్ద ఉద్రిక్తత

అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు 24వ తేదీ ఉదయం 9.00 గంటలకు జీపీఏ 10 నుంచి 7వరకు ఉండి 1నుంచి 136 వరకు ర్యాంకు గల విద్యార్థులు, మధ్యాహ్నం 1.00 గంటకు జీపీఏ 6.8 నుంచి 5.7 వరకు ఉండి 137 నుంచి 270 వరకు ర్యాంకు గల విద్యార్థులు హాజరుకావాలన్నారు. ఈనెల 25వ తేదీ ఉదయం 9.00గంటలకు జీపీఏ 5.7 నుంచి 4.7వరకు ఉండి 271 నుంచి 405 వరకు ర్యాంకు గల విద్యార్థులు, మధ్యాహ్నం 1.00 గంటకు జీపీఏ 4.7 నుంచి 1.6 వరకు ఉండి 406 నుంచి 543 వరకు ర్యాంక్‌ గల విద్యార్థులు జిల్లా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో హాజరుకావాలన్నారు. ఎటువంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు రాని అభ్యర్థులు వారి పదవ తరగతి గ్రేడ్‌ పాయింట్స్‌ ప్రకారంపైన తెలిపిన తేదీలలో షెడ్యూల్‌ ప్రకారం తమ సర్టిఫికెట్‌ కాపీలతో నేరుగా ప్రభుత్వ ఐటీఐ రాజమహేంద్రవరంలో హాజరు కావాలని ప్రిన్సిపాల్‌ క్రిష్ణన్‌ కోరారు.

Quiz Competition for Students : విద్యార్థుల ప్ర‌తిభ‌కు క్విజ్ పోటీలు.. ఈ కేట‌గిరీల్లోనే!

Published date : 22 Jun 2024 11:34AM

Photo Stories