Skip to main content

Job Mela In Government Polytechnic College: గుడ్‌న్యూస్‌, రేపు జాబ్‌మేళా.. నెలకు రూ.20వేల వేతనం

APSSDC job fair event at Hindupur on 10th  Job Mela In Government Polytechnic College  Job fair at Government Women's Polytechnic College  APSSDC job fair details announced by officials  APSSDC job fair event at Hindupur on 10th  Principal Harish Babu discussing Hindupur job fair

హిందూపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా నైపుణ్యాధికారి అబ్దుల్‌ ఖయ్యుం, కళాశాల ప్రిన్సిపాల్‌ హరీష్‌ బాబు మీడియాకు వెల్లడించారు.

CAPF Recruitment 2024: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌లో ఉద్యోగాలు.. ఇదే చివరి తేది

పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల వారు అర్హులని పేర్కొన్నారు. నాలుగు కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఎంపికై న వారికి నెలకు రూ.12వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఎంపికై న వారు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, హైదరాబాద్‌, బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Deepthi Jeevanji: దీప్తి జివాంజీకి రూ.కోటి నగదు.. గ్రూప్‌–2 ఉద్యోగం

అభ్యర్థులు బయోడేటాతో పాటు ఆధార్‌, విద్యార్హత పత్రాలు తీసుకొని, మంగళ వారం ఉదయం తొమ్మిది గంటల హాజరు కావాలని సూచించారు. ఇంటర్వ్యూకు వచ్చేవారు https://rb.gy/70ax6l లింక్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకోవాలని, వివరాలకు 99666 82246 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Published date : 09 Sep 2024 01:08PM

Photo Stories