AI Technology: బడికి తేజస్సు.. కృత్రిమ మేధస్సు!
- పాఠశాలల రోజూవారీ కార్యకలాపాల్లో కొత్త టెక్నాలజీ వినియోగం
- హాజరు, పరీక్షలు, మధ్యాహ్న భోజనం డేటాసేకరణ, విశ్లేషణ
- ట్రిపుల్ ఐటీ సహకారంతో మొయినాబాద్ స్కూళ్లలో ప్రయోగాత్మకంగా
- భవిష్యత్తులో విద్యార్థులకు ఇంగ్లిష్ బోధనలోనూ ఏఐ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, రోజువారీ కార్యకలాపాల్లో ‘కృత్రిమ మేధస్సు’(ఏఐ)ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహా లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్) భాగస్వామ్యంతో ఏఐ టెక్నాలజీని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి క్లస్టర్‌ను ఎంపిక చేసింది. పాఠశాల రోజూవారీ కార్యకలాపాల్లో ఏఐ సాంకేతిక వినియోగంపై ఇప్పటికే ఆ మండల విద్యాధికారితోపాటు క్లస్టర్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లకు ట్రిపుల్ ఐటీ ప్రాథమికంగా అవగాహన కలి్పంచింది. క్లస్టర్ పరిధిలోని వేలాది మంది విద్యార్థులకు సంబంధించి రోజూవారీ హాజరు నమోదు, మధ్యాహ్న¿ోజనం వివరాలు, విద్యార్థుల అభ్యసన తీరుతెన్నులను తెలుసుకునే ఫార్మాటివ్ అసెస్‌మెంట్ వివరాలను విద్యాశాఖ పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేసేందుకు చాలా సమయం తీసుకుంటోంది. ఏఐ సాంకేతికత ఈ అంశాలను సులభతరం చేస్తుందని ట్రిపుల్ ఐటీ వర్గాలు చెప్తున్నాయి.
Also read: Education Sector: కలలో కూడా ఊహించని మహర్దశ
బోధనలోనూ ఏఐ సాంకేతికత
విద్యావిధానం–2021 ప్రకారం విద్యార్థులకు ఫార్మాటివ్ అసెస్‌మెంట్లు తప్పనిసరి చేయడంతో ఉపాధ్యాయులు ప్రతి తరగతిలోని విద్యార్థులను వారానికోమారు మదింపు చేయాల్సి వస్తోంది. తర గతిలో విద్యార్థుల శరీరభంగిమ, ఏకాగ్రత, ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న తీరు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారంగా పని చేసే కెమెరాలు, స్పీచ్ రికగి్నషన్ టెక్నాలజీ, ఇతర పరికరాలు విద్యార్థుల గ్రాహకశక్తిని అంచనా వేసి నివేదికలు ఇస్తాయి. పాఠ్యాంశాలు నేర్చుకోవడంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయు లు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రభు త్వం తప్పనిసరి చేస్తున్నందున ఇంగ్లి‹Ùతోపాటు ఇతర భాషల బోధనలోనూ ఏఐ సాంకేతికను వాడుకునేందుకు అవసరమైన ఏఐ ఆధారిత టూల్స్‌పై ట్రిపుల్ ఐటీ ఇప్పటికే స్టార్టప్‌లు, ఐటీ కంపెనీలతో కలసి పనిచేస్తోంది. ‘ఇంగ్లిష్‌లోని ప్రతి పాఠానికి సంబంధించి కంప్యూటర్ కొన్ని వ్యాఖ్యలను వినిపిస్తే వాటిని విద్యార్థులు వల్లె వేస్తారు. వాళ్లు తమ తప్పొప్పుల ను తెలుసుకుని సరిదిద్దుకునేందు కు ఇది తోడ్పతుంది. తర్వాత ఇతర భాషలకూ ఈ సాంకేతికతను విస్తరిస్తాం’అని ట్రిపుల్ ఐటీ వర్గాలు చెప్పాయి.
Also read: Internet: మెరుగైన సైబర్ ప్రపంచ దిశగా!
ప్రయోగాత్మకంగా కనకమామిడిలో..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 18 పాఠశాలలు కలిగిన కనకమామిడి క్లస్టర్‌ను ఏఐ ఆధారిత టెక్నాలజీ వినియోగానికి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. సంబంధిత క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడితోపాటు మరికొందరు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందుతారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ సాంకేతికతను క్షేత్రస్థాయిలో ఉపయోగించే అవకాశముంది.
వెంకటయ్య, ఎంఈవో, మొయినాబాద్