ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే ఇంటర్న్‌షిప్ ‘స్పాట్’
ఎస్కేయూలో వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో ఏప్రిల్ 19న సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి వీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు వచ్చాయన్నారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి అని అన్నారు. ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి మొత్తం 200 మార్కులు కేటాయించగా, తక్కిన 150 మార్కుల్లో 100 మార్కులు ప్రాజెక్ట్ వర్క్‌కు, 50 మార్కులు వైవా వాయిస్‌కు కేటాయించామన్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే ఇంటర్న్‌షిప్ మూల్యాంకనం నిర్వహించాలన్నారు.
చదవండి:
‘World Quantum Day’కు ట్రిపుల్ ఐటీ శాస్త్రవేత్తలు
Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
ఇంటర్ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్న్‌షిప్ మూల్యాంకనం నిర్వహించే అంశంపై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంటర్న్ షిప్ మూల్యాంకనానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నోడల్ ఆఫీసర్, ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ తప్పనిసరి అని పేర్కొన్నారు. 2023 జూన్‌లో రెండు, నాలుగు, ఐదు, ఆరో సెమిస్టర్ థియరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ ఎ.మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.