Agricultural Officer: విద్యార్థుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
Sakshi Education
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట : దేశం, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల భాగస్వామ్యంతోనే సాధ్యమని జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావు అన్నారు.
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన నారాయణపురంలో ఏప్రిల్ 23న ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ కోర్సు చదువుతున్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
చదవండి: Sports: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడే అవకాశం దక్కుతుందన్నారు. విద్యార్ధులంతా వారం రోజులపాటు గ్రామ రైతులు, ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. ముందుగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్ ఎన్‌ఎస్‌ఎస్ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 29 వరకు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
Published date : 24 Apr 2024 04:10PM