Sports: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ ఇన్‌చార్జ్ అధికారి అనిల్‌కుమార్ ఏప్రిల్ 22న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాకు చెందిన 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో మే 1నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
చదవండి: World Record: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు
ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం వరకు పీడీ, పీఈటీలు, సీనియర్ జాతీయ క్రీడాకారులు మహబూబాబాద్ జిల్లా యువజన, క్రీడలశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 92900 10949 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Published date : 23 Apr 2024 05:57PM