Skip to main content

KTR: ఆ పిల్లల చదువు బాధ్యత నాదే

చెన్నారావుపేట: వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్‌ తండాలో ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు.
Warangal district tragedy  KTR standing with children affected by Premonmadi attack  Sudarshan Reddy thanking KTR for supporting orphan education  responsible for the childrens education  KTR supporting orphaned children in Chennaraopet

నిందితుడు నాగరాజు దాడిలో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలు చనిపోవడంతో పిల్లలు దీపిక, మదన్‌లు అనాథలయ్యారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్నలు జూలై 16న‌ హైదరాబాద్‌లోని కేటీఆర్‌ వద్దకు పిల్లలను తీసుకెళ్లారు.

వారితో మాట్లాడిన కేటీఆర్‌ జరిగిన విషయాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

చదవండి: KTR Demands Job Calendar 2024 : ఏడు నెలలు పూరైంది.. ఇంకెప్పుడు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?

సుగుణ బీఆర్‌ఎస్‌ క్రియాశీల కార్యకర్త, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు కావడంతో పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. 

కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు నాగరాజుకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కేటీఆర్‌ కోరినట్లు చెప్పారు. 

Published date : 17 Jul 2024 11:23AM

Photo Stories