Skip to main content

Community Science Course : ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఈ కోర్సులో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Applications for admissions in B Sc Community Science Course

»    కోర్సు వివరాలు: బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌.
»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    అర్హత: ఇంటర్మీడియట్‌ (బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా (హోమ్‌ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.        »    వయసు: 31.12.2024 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, లాం, గుంటూరు–522034, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి. 
»    దరఖాస్తులకు చివరితేది: 29.07.2024.
»    వెబ్‌సైట్‌: https://angrau.ac.in

PTU Admissions : పీటీయూలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 17 Jul 2024 04:03PM

Photo Stories