Skip to main content

NIT Admissions : నిట్‌లో బీఎస్సీ–బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ ప్రవేశాలు.. కోర్సు వివ‌రాలు..

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టె­క్నాలజీ(నిట్‌)లో నాలుగేళ్ల బీఎస్సీ–బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్‌ (సెకండరీ స్టేజ్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
BSc–BED Integrated Admissions in National Institute of Technology

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది. 
»    కోర్సుల వివరాలు: నాలుగేళ్ల బీఎస్సీ–బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్‌(సెకండరీ స్టేజ్‌)–50 సీట్లు.
»    విభాగాలు: మ్యాథ్స్‌(మైనర్‌ సబ్జెక్టుగా కంప్యూటర్‌ సైన్స్‌), ఫిజికల్‌ సైన్స్‌(మైనర్‌ సబ్జెక్టుగా మ్యాథ్స్‌)
»    అర్హత: 2022/2023/2024 విద్యా సంవత్సరాల్లో 10+2 లేదా 12వ తరగతి/ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌సీఈటీ)–2024 స్కోరు సాధించి ఉండాలి.
»    ఎంపిక: ఎన్‌సీఈటీ–2024 స్కోరు,రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు  చివరితేది:27.08.2024
»    మొదటి దశ ఎంపిక జాబితా వెల్లడి తేది: 02.09.2024.
»    రెండో దశ ఎంపిక జాబితా వెల్లడి తేది: 06.09.2024.
»    తరగతుల ప్రారంభం: 17.09.2024.
»    వెబ్‌సైట్‌: https://nitw.ac.in

IITH: విపత్తుల సమయంలో ఎదుర్కొనేందుకు.. ఐఐటీహెచ్‌లో బాహుబలి డ్రోన్‌ తయారీ!

Published date : 23 Aug 2024 12:27PM

Photo Stories