Skip to main content

Skill Development Centers: రూ.300 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూని వర్సిటీలు ముందుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
Skill development centers with Rs300 crores

హైదరా బాద్‌ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ‘ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫౌండేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌), టెక్సాస్‌ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్‌ రన్‌ వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో మంత్రి  సమావేశమ య్యారు.

అంతర్జాతీయంగా స్టార్టప్‌లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్, యూకేలోని లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ లాంటి పది ప్రఖ్యాత స్కిల్‌ యూనివర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలున్నాయి.

చదవండి: Automative Training: ఆటోమోటివ్‌ రంగంలో 4,000 మందికి శిక్షణ!

సెప్టెంబర్‌ 26 నుంచి 28 వరకు 3 రోజులపాటు హైదరాబాద్‌ నగరంలో జరిగే ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫౌండేషన్‌ సదస్సులో ఈ యూనివర్సి టీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని శ్రీధర్‌ బాబు తెలిపారు. కాగా ఐఎస్‌ఎఫ్‌ చైర్మన్‌ డా. జె.ఎ.చౌదరి, డైరెక్టర్‌ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సాస్‌ రిచర్డ్‌ సన్‌ సిటీ, ఫ్రిస్కో సిటీల ప్రతినిధులు తనను కలిసి తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ’లో సంయుక్తంగా కార్యకలా పాలు చేపట్టడానికి ఆసక్తి వ్యక్తం చేశారని మంత్రి వెల్లడించారు.

మంత్రి శ్రీధర్‌బాబును కలి సిన ప్రతినిధి బృందంలో టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరం మాజీ మేయర్‌ మహెర్‌ మేసో, రిచర్డ్‌ సన్‌ సిటీకి చెందిన ప్రతినిధులు క్రిష్‌ షాక్లెట్, గ్రెగ్‌ సోవెల్, స్టార్టప్‌ రన్‌వే వ్యవస్థాపకుడు మహేశ్‌ నంద్యాల, సీవోవో రవీంద్ర రెడ్డి, చిన్మయ్‌ దాస్, జ్యోత్స్న కొండపులి, అర్చన చిందం, ఐఎస్‌ఎఫ్‌ తరపున వేణుమాధవ్‌ గొట్టుపుల్ల తదితరులు ఉన్నారు.  

Published date : 17 Jul 2024 12:57PM

Photo Stories