Skip to main content

March 23, 24, 25th Schools Holidays 2024 : మార్చి 23, 24, 25 తేదీల్లో స్కూల్స్ సెల‌వులు.. అలాగే కాలేజీల‌కు కూడా.. కార‌ణం ఇదే..! మార్చి 29న‌ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ మార్చి నెల‌లో వ‌రుస‌గా స్కూల్స్‌కు మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. మార్చి 23వ తేదీ నాల్గో శ‌నివారం చాలా స్కూల్స్‌కు సెలవులు ఉన్న విష‌యం తెల్సిందే.
School and college holiday announcement in Telugu states  holi festival school holidays 2024    School holiday announcement in Telugu states

అలాగే మార్చి 24వ తేదీన ఆదివారం.. ఈ రోజు స్కూల్స్‌కు సాధార‌ణగా సెల‌వు ఉంటుంది. మార్చి 25వ తేదీన (సోమ‌వారం) హోలీ పండ‌గ ఉంది. ఈ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చారు. దీంతో వ‌రుస‌గా మూడు రోజులు పాటు స్కూల్స్‌, రెండు రోజులు పాటు కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే మార్చి 29న గుడ్ ఫ్రైడే ఉంది. ఈ సంద‌ర్భంగా మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు ప్రకటించారు.

☛ Schools Summer Holidays 2024 : గుడ్‌న్యూస్‌.. ఈ సారి స్కూల్స్‌కి భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

☛ Sirisha, SI : న‌న్ను ఆఫ్‌ట్రాల్ కానిస్టేబుల్ అన్న ఆ ఎస్పీతోనే..

ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన సెలవులు రానున్నాయి. అలాగే ఏప్రిల్ నెల చివ‌రిల్లో దాదాపు రెండు నెల‌ల పాటు వేస‌విసెల‌వులు ఇవ్వ‌నున్నారు.

 AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో ముందుగానే స్కూల్స్‌కు భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

వేస‌వి సెల‌వులు ఎప్ప‌టినుంచి అంటే..?

2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్  వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది. దాదాపు పైన ఇచ్చిన తేదీల్లోనే స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 22 Mar 2024 03:48PM

Photo Stories