Skip to main content

Schools Summer Holidays 2024 : గుడ్‌న్యూస్‌.. ఈ సారి స్కూల్స్‌కి భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉద‌యం 9 దాటితే బ‌య‌టికి రావాలంటే.. భ‌య‌ప‌డుతున్నారు. ఏప్రిల్ నెల‌లో ఇంకా ఎండ‌లు ఎక్క‌వ ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పుతున్నారు.
 Extended Summer Vacation 2024  School Summer Holidays 2024  Summer Vacation   April 24th to June 13th, 2024

ఈ నేప‌థ్యంలో స్కూల్స్ విద్యార్థుల‌కు ముందుగానే వేస‌విసెల‌వులు ఇచ్చే అవ‌కాశం క‌న్పిస్తుంది. ప్ర‌స్తుతం ఒంటిపూట బడులు న‌డుస్తున్న విష‌యం తెల్సిందే. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్‌ 23వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఇలా..

AP and TS Summer Holidays 2024 Telugu News

2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్  వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది. దాదాపు పైన ఇచ్చిన తేదీల్లోనే స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

☛ AP Half Day Schools 2024 : ఏపీలో ఒంటిపూట బడులు ఎప్ప‌టి నుంచి అంటే..? అలాగే స్కూల్‌ టైమింగ్స్‌ ఇవే.. కానీ..!

గ‌త ఏడాది సెల‌వులు ఇలా...
గ‌త ఏడాది తెలంగాణ‌ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  గ‌త ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. గ‌త ఏడాది వేస‌వి సెల‌వులు త‌క్కువ‌గానే ఇచ్చారు.

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా..

Tenth Class Students Summer Holidays New 2024 Telugu News

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాల్‌టికెట్లను కూడా విడుదల చేసిన విద్యాశాఖ. అయితే వీళ్ల‌కు కూడా ప‌రీక్ష‌లు పూరైన వెంట‌నే వేస‌వి సెల‌వులు రానున్నాయి. టెన్త్ విద్యార్థుల‌కు కూడా దాదాపు 50 నుంచి 60 రోజులు పాటు వేస‌వి సెల‌వులు రానున్నాయి.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 15 Mar 2024 03:48PM

Photo Stories