Skip to main content

AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో ముందుగానే స్కూల్స్‌కు భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా రోజురోజుకు ఎండ తీవ్ర‌త పెరుగుతూనే ఉంది. పెద్ద‌వాళ్లే ఇంటి నుంచి బ‌య‌టికి రావాలంటే.. భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి చిన్న పిల్ల‌ల అయితే ఎండ తీవ్ర‌తకు చాలా ఇబ్బంది ప‌డుతున్నారు.
Hot weather alert in Andhra Pradesh    Early summer vacation proposal   ap school summer holidays 2024 news in telugu   AP Education Department considering early holidays

ఈ నేప‌థ్యంలో స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఈ సారి ముందుగానే ఇచ్చే అవ‌కాశం. ఇప్ప‌టికే ఒంటిపూట ఒడులు నిర్వ‌హిస్తున్న విష‌యం తెల్సిందే. ఏపీ విద్యాశాఖ అధికారులు ఈ సారి స్కూల్స్‌కు ముందుగా సెల‌వులు ఇవ్వ‌ల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

☛ Schools Holidays Cancel 2024 : ఈ 'సారీ' స్కూల్స్‌ సెలవులు రద్దు.. కార‌ణం ఇదే..!

ప్రస్తుతం స్కూల్స్‌కు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కార‌ణంగా ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్కూల్ పిల్ల‌ల‌కు తాగునీటి సమ‌స్య‌లు లేకుండా చూడాల‌ని అధికారులు స్కూల్స్ ఆదేశాలు జారీ చేశారు.

దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు..?

Holidays news 2024 Summer

ఏపీలో 2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్  వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది. దాదాపు పైన ఇచ్చిన తేదీల్లోనే స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. 

టెన్త్ విద్యార్థుల‌కు 60 రోజులు పాటు..?

summer holidays for school students 2024

ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు.. అయితే వీళ్ల‌కు కూడా ప‌రీక్ష‌లు పూరైన వెంట‌నే వేస‌వి సెల‌వులు రానున్నాయి. టెన్త్ విద్యార్థుల‌కు కూడా దాదాపు 50 నుంచి 60 రోజులు పాటు వేస‌వి సెల‌వులు రానున్నాయి.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

 గ‌త ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 1వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. గ‌త ఏడాది వేస‌వి సెల‌వులు త‌క్కువ‌గానే ఇచ్చారు. తెలంగాణ‌ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

Published date : 20 Mar 2024 10:16AM

Photo Stories