Skip to main content

Schools Holidays Cancel 2024 : ఈ 'సారీ' స్కూల్స్‌ సెలవులు రద్దు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ :మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప‌బ్లిక్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అలాగే మార్చి 18వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని డీఈఓ సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒంటిపూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలన్నారు.
Cancelled School Holidays by Education Department Officials  AP school holidays 2024 cancelled   Andhra Pradesh Tenth Class Public Examinations

ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదోవ తరగతి పరీక్షలు జరగనున్నాయని.., ఈ పరీక్షలకు కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు పరీక్షలు జరిగే రోజుల్లో సెలవు ప్రకటించినట్లు తెలిపిన విష‌యం తెల్సిందే. విద్యాశాఖ అధికారాలు. మార్చి 18, 19, 20, 22, 23, 26, 27,28, 30 తేదీల్లో స్కూల్స్ సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. అయితే ఈ సెల‌వుల‌ నిర్ణ‌యాన్ని విద్యాశాఖ అధికారులు వెన‌క్కి తీసుకున్నారు. ఇచ్చిన ఈ సెల‌వులను ర‌ద్దు చేశారు.
అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒంటిపూట బడులను నిర్వహించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు సూచిస్తున్నారు. విద్యాశాఖ నిర్దేశించిన పలు ఆదేశాలు/సూచనలను ఆయన పాఠశాలలకు చేరవేశారు. 

AP SSC 10th Class 2024 Timetable :
☛ మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
☛ మార్చి 19 న సెకండ్ లాంగ్వేజ్
☛ మార్చి 20 న ఇంగ్లిష్
☛ మార్చి 22 తేదీ మ్యాథ్స్‌
☛ మార్చి 23వ తేదీ ఫిజికల్ సైన్స్
☛ మార్చి 26వ తేదీ బయాలజీ
☛ మార్చి 27వ తేదీ సోషల్ స్టడీస్
☛ మార్చి 28వ తేదీ మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
☛ మార్చి 30వ తేదీ ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.

ఈ ఏడాది వేస‌వి సెల‌వులు..
2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్  వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రుకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాది వేస‌వి సెల‌వులు ఎక్క‌వగా ఇచ్చే అవ‌కాశం ఉంది. దాదాపు పైన ఇచ్చిన తేదీల్లోనే స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేస‌వి సెల‌వులపై ఇంకా అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

గ‌త ఏడాది సెల‌వులు ఇలా...
గ‌త ఏడాది తెలంగాణ‌ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  గ‌త ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. గ‌త ఏడాది వేస‌వి సెల‌వులు త‌క్కువ‌గానే ఇచ్చారు.

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు..
అయితే వీళ్ల‌కు కూడా ప‌రీక్ష‌లు పూరైన వెంట‌నే వేస‌వి సెల‌వులు రానున్నాయి. టెన్త్ విద్యార్థుల‌కు కూడా దాదాపు 50 నుంచి 60 రోజులు పాటు వేస‌వి సెల‌వులు రానున్నాయి.

Published date : 18 Mar 2024 10:09AM

Photo Stories