Skip to main content

Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌టెస్టులు..

అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించే ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్‌ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. టెక్నాలజీ పార్టనర్‌గా మై ర్యాంక్‌ వ్యవహరిస్తోంది. 

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

మూడు టెస్టులు.. మూడు రోజులు.. ఎప్పుడంటే? 

పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.arenaone.in/mock ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.350/–. రిజి్రస్టేషన్‌కు ఏప్రిల్‌ 25 చివరి తేదీ. రిజిస్టర్‌ చేసుకున్న ఈమెయిల్‌కు పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్‌ నెంబర్‌ వస్తుంది. ఒక్కో స్ట్రీమ్‌కు (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, నీట్‌) మూడు టెస్టులు ఉంటాయి. ఈ పరీక్షలను మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను మీ యూజర్‌ నేమ్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌ (యూజర్‌ నేమ్‌), ఫోన్‌ నెంబర్‌ (పాస్‌వర్డ్‌)తో ఆ మూడు రోజుల్లో ఎప్పుడైనా లాగిన్‌ అయ్యి రాసుకోవచ్చు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా చూసుకోవచ్చు. మాక్‌ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in వెబ్‌సైట్‌లో నిర్వహిస్తారు. టెస్ట్‌కి సంబంధించిన కీ ని 5న ఇదే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. çపూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 95055 14424, 96660 13544, 96665 72244. 

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

Published date : 12 Apr 2023 10:17PM

Photo Stories