Gurukula students: గురుకుల విద్యార్థులకు స్లైడింగ్ ఆప్షన్
Sakshi Education

కర్నూలు(అర్బన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి మొదటి జాబితాలో ఎంపికై ప్రవేశం పొందిన విద్యార్థులకు స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చినట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డిరేటర్ డా.ఐ శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆప్షన్ ద్వారా తాము ప్రవేశం పొందిన గురుకుల పాఠశాల నుంచి వేరొక గురుకుల పాఠశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు తాము ఎంపికై న పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఈ నెల 18 నుంచి 22వ తేదీ లోపు తల్లి/ తండ్రి/ సంరక్షకుని సంతకంతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించాలన్నారు. స్లైడింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మరింత సమాచారం కోసం 08518295601/ 9010070219 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
చదవండి: Entrance Exam: గురుకుల ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడంటే..
Published date : 18 Apr 2024 07:01PM