Railway Recruitment : 1,100 రైల్వే ఉద్యోగాల భర్తీకి చర్యలు
Sakshi Education
గుంతకల్లు: రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలో ఎంపికైన దాదాపు 1,100 మందికి గురువారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు సీనియర్ డీపీఓ జయశంకర్‌చౌహన్, సీనియర్ డీసీఎం ప్రశాంత్‌కుమార్ తెలిపారు. గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
2021, అక్టోబర్ 2న ప్రారంభించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 71వేల ఉద్యోగాలను భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే గుంతకల్లు డివిజన్ పరిధిలో 1,100 రైల్వే ఉద్యోగాలతోపాటు పోస్టల్ విభాగంలో 13 మందికి, హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో 23 మందికి నియామకపు ఉత్తర్వులు సిద్ధమైనట్లు వివరించారు. వీటిని గుంతకల్లులోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గురువారం ఉదయం రైల్వే సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ ధన్వే చేతుల మీదుగా అర్హులకు అందజేయనున్నట్లు తెలిపారు.
Published date : 13 Apr 2023 06:20PM