Startup Vizag Hub: స్టార్టప్ హబ్‌గా ఏపీ... ఏపీలో స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహం
దేశంలోనే టాప్ ఫండింగ్ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ రాష్ట్రంలోని స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది.
☛ ఇకపై సెకండ్ ఇయర్ నుంచి బ్రాంచి మారతామంటే కుదరదు.. స్పష్టం చేసిన కేంద్రం
ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్‌లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు ఫండింగ్ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) చైర్మన్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్‌టెక్ ఇండియాలు సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
☛ షెడ్యూల్ ప్రకారమే ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్ 1 పరీక్ష... పూర్తి వివరాలు ఇవే..!
గుజరాత్ రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్ స్టార్ట్ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చెప్పారన్నారు. దీంతో ఏపీ స్టార్టప్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫండింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ ముందుకు వచ్చిందన్నారు.
చదవండి: రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!
ఆ సంస్థ భాగస్వాములు రమేష్ లోగనాథం, విక్రాంత్ వర్షిణి విశాఖలోని 40 మందికిపైగా హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్‌కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వరకు సక్సీడ్ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేసి, అనంతరం రూ.1,000 కోట్లకు చేర్చి స్టార్టప్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.