Skip to main content

Btech: ఇక‌పై సెకండ్ ఇయ‌ర్ నుంచి బ్రాంచి మార‌తామంటే కుద‌ర‌దు.. స్ప‌ష్టం చేసిన కేంద్రం

విద్యార్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లే నిర్ణ‌యాన్ని కేంద్రం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌స్ట్ ఇయ‌ర్లో కోరుకున్న బ్రాంచి రాని స‌మ‌యంలో ఆ ఏడాది బాగా చ‌దివి మెరిట్ సాధిస్తే.. సెకండ్ ఇయ‌ర్‌లో కోరుకున్న బ్రాంచిలో చేరే అవ‌కాశం ఉండేది. దీంతో కౌన్సెలింగ్‌లో కోరుకున్న బ్రాంచి రానివారు ఫస్ట్ ఇయ‌ర్ క‌ష్ట‌ప‌డి చ‌దివి అత్య‌ధిక మార్కులు సాధించేవారు.
IIT Bombay
IIT Bombay

ఆ మార్కుల ప్రాతిప‌దిక‌న సెకండ్ ఇయ‌ర్‌లో కోరుకున్న బ్రాంచిలో చేరేవారు. అయితే ఇక నుంచి ఇలాంటివి కుద‌ర‌వు. కౌన్సెలింగ్‌లో ఏ బ్రాంచిని తీసుకుంటే బీటెక్ నాలుగేళ్ల పాటు అదే కోర్సులో ఉండాల్సింది. ఈ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

చ‌ద‌వండి: షెడ్యూల్ ప్ర‌కార‌మే ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్ 1 ప‌రీక్ష‌... పూర్తి వివ‌రాలు ఇవే..!

iit bombay

చదువు ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో వాటిని నిరోధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీటెక్‌ తొలి ఏడాది పూర్తయ్యాక మెరిట్‌ ప్రాతిపదికన రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిలోకి మారే వెసులుబాటును రద్దు చేయాలని ఐఐటీలు, ఎన్‌ఐటీలను ఆదేశించింది. ఈ నిర్ణ‌యాన్ని తాజాగా అమ‌లు చేస్తామ‌ని ఐఐటీ బాంబే స్ప‌ష్టం చేసింది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ తొలి ఏడాదిలో అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు సాధిస్తే రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిని దక్కించుకునే అవకాశముంది. అందుకు 10% సీట్లు కేటాయిస్తారు.

చ‌ద‌వండి: రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్‌పై సుప్రీం స్టే..!

iit bombay

విపరీతమైన పోటీ ఉండటంతో కళాశాలల్లో చేరిన నాటి నుంచే అహర్నిశలు శ్రమిస్తున్న విద్యార్థులు ఆశించింది దక్కకుంటే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే 2023-24 విద్యా సంవత్సరం నుంచి అలాంటి అవకాశాన్ని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. గత నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణపైనే సుదీర్ఘంగా చర్చ సాగింది. 

iit bombay

చ‌ద‌వండి: 1.6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఎన్ఐటీ అమ్మాయి

ఆత్మ‌హ‌త్య‌లు ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఒత్తిడికి ప్రధాన కారణమైన బ్రాంచి మార్పును రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశించారు. దేశంలోని 23 ఐఐటీల్లో 16,600 సీట్లు ఉన్నాయి. అలాగే 31 ఎన్‌ఐటీల్లో 24 వేల సీట్లున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీల్లో దాదాపు 20% సీట్లను తెలుగు విద్యార్థులే సాధిస్తున్నారు.

Published date : 16 May 2023 03:02PM

Photo Stories