TSPSC | షెడ్యూల్ ప్రకారమే ఆఫ్‌లైన్‌లోనే గ్రూప్ 1 పరీక్ష... పూర్తి వివరాలు ఇవే..!
ఇంతమందికి ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రస్తుతానికి లేవు. దీంతో ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహించనున్నారు.
☛ లక్షల జీతం ఏం చేసుకోను...మనశ్శాంతే లేదు... ఐటీ ఉద్యోగుల ఆవేదన..!
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జూన్ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,85,916 మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు 25,050 మంది ఎంపికయ్యారు.
☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. పేపర్ లీక్ అవడంతో వేరే గత్యంతరం లేక అప్పటివరకు నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేసేసి, మళ్లీ రీ షెడ్యూల్ ప్రకటించింది. లీకేజీ ఘటన పునరావ`తమవకుండా ప్రత్యేకంగా పరీక్షల బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బీఎం సంతోష్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించింది.
☛ 15 ఏళ్లుగా పని చేయకపోయినా... ఏటా రూ.55 లక్షల జీతం.. చివరికి కంపెనీకి షాక్ ఇచ్చిన ఐటీ ఉద్యోగి
గతంలో పనిచేసిన సబ్జెక్ట్ నిపుణులందరినీ మార్చేసింది. మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జూన్ 11నే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేసింది.
తెలంగాణలో ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఆ సంఖ్యను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏదైనా పరీక్షకు 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మాత్రమే కంప్యూటర్ బెస్డ్ పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్ పద్ధతిలో లెక్కిస్తారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు.
➤☛ TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరిన్ని అరెస్టులు ఇవే..? ఇప్పటి వరకు..
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లు | కొత్త పరీక్షల తేదీలు |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ | మే 13 |
అగ్రికల్చర్ ఆఫీసర్ | మే 16 |
ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రైరియన్ పోస్టులు | మే 17 |
అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ | మే 08, మే 09, మే 21 |
డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులు | మే 19 |
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష | జూన్ 11 |
హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు | జూన్ 17 |
ఏఎంవీఐ | జూన్ 26 |
గ్రూప్ 4 పరీక్ష | జులై 01 |
గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ (గెజిటెడ్ - నాన్ గెజిటెడ్) | జులై 18, 19, 21 |
గ్రూప్ 2 పరీక్ష.. | ఆగస్టు 29, 30 |