IT worker on sick leave: 15 ఏళ్లుగా పని చేయకపోయినా... ఏటా రూ.55 లక్షల జీతం.. చివరికి కంపెనీకి షాక్ ఇచ్చిన ఐటీ ఉద్యోగి

చివరికి కోర్టులో ఉద్యోగికి న్యాయం జరిగిందా? లేదంటే ఐబీఎంకు అనుకూలంగా తీర్పిచ్చిందా? అన్న విషయాన్ని ఇక్కడ చూద్దాం.
చదవండి: లక్షల జీతం ఏం చేసుకోను...మనశ్శాంతే లేదు... ఐటీ ఉద్యోగుల ఆవేదన..!
ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్ ఐటీ ఉద్యోగి. అనారోగ్యం కారణంగా 2008 సెప్టెంబర్ నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. సహృదయంతో నిబంధనలకు అనుగుణంగా ఐబీఎం ప్రతినెల జీతాన్ని ఇయాన్ ఖాతాలో జమ చేసేది. ఈ క్రమంలో 2013లో అతడు కంపెనీపై ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల నుంచి తన జీతాన్ని పెంచడం లేదని ప్రశ్నించాడు. తన గోడును సంస్థ ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు.

దీంతో కంగుతిన్న ఐబీఎం యాజమాన్యం అతనితో ఓ ఒప్పందానికి వచ్చింది. ఈ మేరకు అతడు ఇకపై సంస్థపై ఫిర్యాదు చేయకూడదు. అందుకు ప్రతిఫలంగా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించే విధంగా ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. పైగా ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) 65 ఏళ్లు వచ్చే వరకు జీతం అందిస్తామని ఐబీఎం తెలిపింది.
☛ ఐటీ హబ్‌గా వైజాగ్... రెండు నెలల్లో 2 వేల ఉద్యోగాలు

ఈ తరుణంలో ఇయాన్ మరో సారి ఐబీఎం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్ ప్లాన్ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ. కాబట్టి తన వేతనం పెంచాలని కోరారు. అందుకు సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో చేసేది లేక 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల కంపెనీ వివక్ష చూపుతోందని ఆరోపించాడు.

☛ అయ్యో పాపం... చేరిన ప్రతీ కంపెనీలోనూ మొండిచేయే...
ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు ఖంఢించింది. సంస్థ వైద్యం చేయిస్తోంది, ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీనీ అందిస్తోందని. ఇక వివక్ష ఎక్కడ ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. కాకపోతే పెరిగిన ధరల వల్ల ఇయాన్‌కు వచ్చే వేతనం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. సంస్థపై అతను చేసిన వివక్ష ఆరోపణల్ని, శాలరీ పెంచాలన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.