Skip to main content

Andhra Pradesh: ఉపాధిలో మళ్లీ ఏపీనే టాప్‌

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తిగా ఆగిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. పనులు దొరకక పేదలు నగరాలకు వలస పోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్లలోనే వారికి పనులు క‌ల్పించ‌డంలో ఏపీ ఏటా ముందుంటోంది.
Mahatma Gandhi NREGA
Mahatma Gandhi NREGA
  • వ్యవసాయ పనులు లేని వేసవి రోజుల్లో పేదలకు పనులు
  •  
  • 50 రోజుల్లో 6.83 కోట్ల పనిదినాలపాటు పనుల కల్పన  
  •  
  • రూ.1,657 కోట్ల మేర పేదలకు లబ్ధి 
  •  
  • మొత్తం 31.70 లక్షల కుటుంబాలకు మేలు
mgnrega

☛➤☛ బందరు పోర్టు కల నెరవేర్చాం... ఇక‌పై జిల్లా చరిత్ర మార‌బోతోంది

ప్రత్యేకించి వేసవి రోజుల్లో ఉపాధి పనుల కల్పనలో గత నాలుగేళ్లగా మన రాష్ట్రమే దేశంలో తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ వేసవిలో కూడా ఏప్రిల్‌ 1 నుంచి శనివారం (మే 20) వరకు 6.83 కోట్ల పనిదినాల పాటు రాష్ట్ర ప్రభు­త్వం పనులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 99 శాతం గ్రామ పంచాయతీలు అంటే.. 13,132 గ్రామ పంచాయతీల్లో కేవ­లం 50 రోజుల్లోనే మొత్తం 31.70 లక్షల కుటు­ంబాలకు పని దొరికింది.

mgnrega

ప్రభుత్వం  కల్పి­ంచిన పనులతో ఈ కుటుంబాలు రూ.1,657.58 కోట్ల మేర లబ్ధి పొందడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 50 రోజుల కాలంలో 5.20కోట్ల పనిదినాలపాటు పను­లు కల్పించింది.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి.

☛➤☛ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వ‌రుస‌గా గుడ్‌న్యూస్‌లు

mgnrega

ఒక్కొక్కరికి రోజుకు రూ.245 
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఈ ఏడాది అధిక మొత్తంలో కూలి సైతం గిట్టుబాటు అయ్యింది. ఈ 50 రోజుల్లో కూలీలకు సరాసరిన రోజుకు రూ.245 చొప్పున కూలి లభించింది. మరోవైపు ఈ పనులకు 60 శాతానికి పైగా మహిళలే హాజరై ఉపాధి పొందారు. అలాగే మొత్తం 6.83 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పొందిన వారిలోనూ దాదాపు 32% మేర ఎస్సీ, ఎస్టీలే ఉ­న్నారని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు.

☛➤☛ పేదలకు ఇళ్లివ్వడంలో ఏపీ నంబర్‌–1

Published date : 22 May 2023 03:27PM

Photo Stories