Skip to main content

AP govt: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వ‌రుస‌గా గుడ్‌న్యూస్‌లు...

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో, పలువురు ఉద్యోగులు బదిలీ కానున్నారు.

కాగా, బదిలీలపై ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న నిషేధాన్ని ఉపసంహరిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈనెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీలకు అవకాశం ఏర్ప‌డింది. ప్రస్తుతం ఉన్న చోట రెండేళ్లకు పైబడి పనిచేసిన ఉద్యోగులు బదిలీ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఉత్వ‌ర్వ‌ల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. 

Ap

హెచ్ఆర్ఏ విష‌యంలో...
అలాగే కొద్ది రోజుల కింద‌ట కూడా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది. 

➤☛ ఇది క‌దా స‌క్సెస్ అంటే... రోజుకు 1.6 ల‌క్ష‌లు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన కుర్రాడు

హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది.

Published date : 17 May 2023 06:26PM

Photo Stories