Good News to Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... హెచ్‌ఆర్‌ఏ పెంపు
Sakshi Education
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది.
YS Jagan
హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది.