AP 10th Advanced Supplementary Exams Dates 2023 : జూన్ 2వ తేదీ నుంచి 10 వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు మే 8వ తేదీన (సోమవారం) పరీక్షల నిర్వహణ విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
☛ Download AP 10th Class Model Papers - 2023 TM | EM
☛ చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఓఎస్‌ఎస్‌సీ) పరీక్షలు కూడా ఇదే షెడ్యూల్‌లో నిర్వహిస్తారు.
ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2023 తేదీలు ఇవే..
పరీక్ష తేదీ | పరీక్ష |
జూన్ 2 (శుక్రవారం) |
ఫస్ట్ లాంగ్వేజ్/ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) |
జూన్ 3 (శనివారం) | సెకెండ్ లాంగ్వేజ్ |
జూన్ 5 (సోమవారం) | ఇంగ్లిష్ |
జూన్ 6 (మంగళవారం) | మ్యాథమెటిక్స్ |
జూన్ 7 (బుధవారం) | సైన్స్ |
జూన్ 8 (గురువారం) | సోషల్ స్టడీస్ |
జూన్ 9 (శుక్రవారం) | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2/ఓఎస్‌ఎస్‌సీమెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 |
జూన్ 10 (శనివారం) | ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 |
Published date : 10 May 2023 03:59PM