Bright future: ఉజ్వల భవిత!
మదనపల్లె సిటీ: వారంతా మూగ, చెవుడు, చూపు తక్కువ, పూర్తిగా కనపడని పిల్లలు. అయితేనేం అందరితో పాటే తామూ దేనిలోనూ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. ప్రభుత్వ సహకారంతో భవిత కేంద్రాల్లో ఉంటూ చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నా రు. ఆ విద్యార్థులు మరింత ఉత్తమంగా ఎదిగేలా... ఉన్నత భవితకు బాటలు వేసుకునేలా సహకారం అందించాలని వై.ఎస్.జగన్ సర్కారు నిర్ణయించింది. భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు అత్యుత్తమ కంటెంట్ నిక్షిప్తం చేసిన ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వెరసి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కేంద్రాలు చిరునామాగా నిలుస్తున్నాయి.
- విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణల ఒరవడి కొనసాగుతోంది. విద్యార్థులకు అన్ని రకాలుగా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు.
- జిల్లాలో 30 భవిత కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 560 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారికి కావాల్సిన మెటీరియల్స్ అందజేస్తున్నారు. దీంతో పాటు ఫిజియెథెరపీ నిర్వహిస్తున్నారు. మూగ, చెవుడు, దృష్టిలోపం, పూర్తిగా కనబడిని వారు సైతం సాధారణ విద్యార్థుల్లా ఉన్నత విద్యను చదవాలనే ఉద్దేశంతో ఆధునిక సాంకేతికతతో కూడిన ట్యాబ్‌లను ప్రత్యేక అవసరాల విద్యార్థులకు అందజేయనున్నారు.
- ఒక్కో ట్యాబ్ రూ.29 వేలు, కీ బోర్డు 8 వేలు విలువ చేస్తోంది. ఆయా కేటగిరీల చిన్నారులకు సులభంగా చదువుకోవడానికి వీలుగా ట్యాబ్‌లను రూపకల్పన చేశారు. ఇటీవల ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లాలోని భవిత కేంద్రాలు : 30
ప్రత్యేక అవసరాల పిల్లలు : 560
పంపిణీ చేసే ట్యాబ్‌లు : 143
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు అనుగుణంగా ట్యాబ్‌లలో కంటెంట్ నిక్షిప్తం చేశారు. బిమై ఐస్, ఎన్ విజన్ ఆల్, గూగుల్ ట్రా న్స్‌క్రెబ్, గూగుల్ లుక్ అవుట్, డాక్స్, సీట్, జీ బోర్డు, ఫిజికల్ కీ బోర్డు, నోట్ ప్యాడ్, గూగుల్ కీ తదితర ప్రత్యేకతలు వీటిల్లో ఉన్నాయి. జిల్లాలో 143 ట్యాబ్‌లను చూపులేని, దృష్టిలోపం, వినికిడి లోపం, ఐఈఆర్టీలకు అందజేయనున్నారు.
చదవండి: Free training in tailoring: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ