Skip to main content

Free training in tailoring: మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Union Bank's Commitment to Rural Skill Development, Creating Job Opportunities in Rural Communities, Free Tailoring Training for Rural Women, Free training in tailoring, Union Bank's Rural Employment and Tailoring Program,

చంద్రగిరి: గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు యూనియన్‌ బ్యాంకు గ్రామీణ ఉపాధి సంస్థ డైరెక్టర్‌ సురేష్‌ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 29 నుంచి 30 రోజులు కొనసాగుతుందని పేర్కొన్నారు. తెల్లరేషన్‌ కార్డు కలిగి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెంది 19 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని, కనీసం 10వ తరగతి చదివిన నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు.

శిక్షణలో భోజన వసతి కల్పిస్తామని, రాను–పోను ఒక్కసారి బస్సు చార్జీలు చెల్లిస్తామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ఆసక్తి కల వారు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జిరాక్స్‌, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక బ్యాచ్‌కు 25 నుంచి 30 మందిని చేర్చుకుంటామని, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వివరాలకు యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణాభివృద్ధి సంస్థ, ద్వారకానగర్‌, కొత్తపేట, చంద్రగిరి. ఫోన్‌ నంబరు 79896 80587, 94949 51289, 63017 17672లో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 28 Nov 2023 02:11PM

Photo Stories