Good News For Grama Ward Volunteers : గ్రామ/వార్డు వలంటీర్లులకు సీఎం జగన్ వరాలు ఇవే..!
![Good News For Grama Ward Volunteers](/sites/default/files/images/2024/02/15/ap-cm-ys-jangan-home-top-story-1708005683.jpg)
వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అలాగే గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదని సీఎం చెప్పారు.
2,50,439 మంది వాలంటీర్లులకి..
![AP Grama Ward Volunteer Update News in Telugu](/sites/default/files/images/2024/08/14/cmysjagan11-1723619967.jpg)
వాలంటీర్లు నా సైన్యం.. పేదలకు సేవ చేసే వాలంటీర్లే.. రేపు కాబోయే లీడర్లు. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు.. వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా. ఇవాళ్టి నుంచి వారంపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 875 మంది వాలంటీర్లకు సేవావజ్రా అవార్డులు. 4,150 మంది సేవారత్న అవార్డులతో గౌరవం. 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులతో సన్మానం. 2,55,464 మంది వాలంటీర్లకు అభివందనలతో నగదు బహుమతి. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇకపై వలంటీర్లకు..
మన ప్రభుత్వ పథకాలకు వలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు. ఇకపై వీరికి వివిధ విభాగాల్లో 2.55 లక్షల మంది వలంటీర్లకు సత్కారం చేయనున్నాము. అలాగే సేవావజ్రాలకు రూ.30 వేల నుంచి రూ.45 వేలకు పెంచారు. సేవారత్నలకు రూ. 20వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. సేవా మిత్రలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు.
వారి మొహాల్లో ఆనందం.. పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు.. :
![ap cm ys jagan latest news telugu](/sites/default/files/inline-images/CM%20Jagan%20Heavy%20Crowd%20Public%20Meeting%20at%20Phirangipuram%20Photos_15.jpg)
నా పేరు దాసరి జ్యోత్స్నా దేవి. నేను గొల్లపాలెం గ్రామం, ఫిరంగిపురం మండలంలో వలంటీర్ ఉద్యోగం చేస్తున్నాను. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ పథకానికి అర్హులో గుర్తించి వారికి ఆ పథకం అందించేటప్పుడు వారి మొహాల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు మా దీవెనలు ఉంటాయని మా చేతులు తాకినప్పుడు ఉండే అనుభూతి మరిచిపోలేం. నా పరిధిలో వృద్దాప్య పింఛన్ తీసుకునే తాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకటో తారీకు నేను రాత్రి 12 వరకు ఆయన దగ్గర కూర్చుని యాప్ ఓపెన్ అవగానే ఆయనకు పింఛన్ ఇచ్చాను. ఆ తర్వాత 2,3 గంటలకు దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు, అప్పుడు తన భార్య వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు ఇది కదా సేవ అని అనిపించింది, మన ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.
తల్లి గర్భంలోని శిశువు నుంచి వృద్దాప్యం వరకు..
ప్రతి నెలా రైస్ తీసుకుంటూ అక్కా మీ వల్లే మాకు సాధ్యమైందనేటప్పుడు సంతోషంగా ఉంటుంది. తల్లి గర్భంలోని శిశువు నుంచి వృద్దాప్యం వరకు ప్రతి ఒక్కరికీ... వారికి సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు, ఇన్ని పథకాలు ఇస్తున్న సీఎంగారి వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎవరైనా ఉంటారా, అందుకే మీరు ప్రజల గుండెల్లో ప్రత్యక్ష దైవమయ్యారు, మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని మా వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నాను, ప్రజలు మీ కోసం సిద్దంగా ఉన్నారన్నా, మీ పాలన కోసం మళ్లీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు, ధన్యవాదాలు.
ఓ 22 ఏళ్ళ యువకుడు కూలి పనులకు వెళ్ళి 4 వ అంతస్ధు నుంచి..
నా క్లస్టర్‌లో 62 కుటుంబాలు ఉన్నాయి, అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీరు పాదయాత్రలో అందరికీ భరోసా ఇచ్చారు, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు, మీరు 2,62,000 మంది వలంటీర్ సైన్యాన్ని సిద్దం చేశారు, మీ ఆశయాలను నిలబెట్టేలా మేం పనిచేశాం, గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి, కానీ ఈ రోజు ప్రతి గడప తొక్కి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నారు, అన్నా నా పరిధిలో 22 ఏళ్ళ యువకుడు కూలి పనులకు వెళ్ళి 4 వ అంతస్ధు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళ్ళాడు, కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం సంజీవనిలా పనిచేసింది, అతని కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ. 5,000 చొప్పున రెండునెలలకు రూ. 10 వేలు ఇచ్చాం, నా పరిధిలో ఉన్న వారికి ఫించన్లు ఇచ్చేటప్పుడు సంతోషంగా పండుగలా తీసుకుంటున్నారు.
మీ చిరునవ్వు మాకు ఆత్మస్ధైర్యాన్ని ఇస్తుంది, ఈ వలంటీర్ వ్యవస్ధను మొదట్లో చాలా కించపరిచి మాట్లాడారు, కానీ మీరు మాకు అండగా నిలిచి ఇచ్చిన ధైర్యం మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది, మీరు నా వలంటీర్లు అంటూ అన్న ప్రతి సారి మాకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేశాం, మేం ఈ జన్మలో మరిచిపోలేం, మాలోని ప్రతిభను గుర్తించి మాకు ఇచ్చే ఈ అవార్డులను పెంచడం చాలా సంతోషంగా ఉంది, అన్నా మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం, మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, మా వలంటీర్ కుటుంబ సభ్యులందరి తరపునా మీకు ధన్యవాదాలు.
- షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం.
![AP Grama Ward Volunteer Awards 2024](/sites/default/files/inline-images/CM%20Jagan%20Heavy%20Crowd%20Public%20Meeting%20at%20Phirangipuram%20Photos_21.jpg)
అందరికీ నమస్కారం, అన్నా మీరు సీఎం అయిన తర్వాత దాదాపు 2,55,000 కు పైగా వలంటీర్లను గుర్తించి వారి ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం, చంద్రబాబు అనేక మాటలు చెప్పి మాట తప్పిన విషయం అందరికీ తెలుసు, మీరు ఈ వలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చినప్పుడు అనేకమంది అవాకులు చవాకులు మాట్లాడారు, ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. అది కదా పాలన అంటే...గతంలో వలంటీర్లను ఇంటికి రానివ్వడానికి జంకేవారు కానీ ఇప్పుడు మా అమ్మాయి, అబ్బాయి అని మాట్లాడుతున్నారు, సూర్యుడి కంటే ముందు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో వలంటీర్లు సైనికుల్లా సేవలందించారు, వారి సేవలకు గర్వపడుతున్నాం, ఈ రోజు పెద్దలెవరికైనా బాగులేకపోతే బిడ్డలకు ఫోన్ చేసినా చేయకపోయినా వలంటీర్‌కు చేసి అడుగుతున్నారు.
ఒక వలంటీర్‌ను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత మీదే అన్నా, మన దేశం హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మీరు, ఒకే నోటిఫికేషన్‌తో 1,35,000 సచివాలయ సిబ్బందిని కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఉద్యోగాలు కల్పించారు, కేంద్రం లెక్కల ప్రకారం 16 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి, పేద ప్రజల గుండె చప్పుడు మీరు, ఈ ప్రాంతంలో కార్మెల్ మాత కొండ పైకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారు, మిమ్మల్ని మళ్ళీ సీఎం చేసుకుని ఆ కోరిక తీర్చుకుంటాం, ధన్యవాదాలు.
-మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు
Tags
- AP Grama Ward Sachivalayam Employees Awards 2024
- AP Grama Ward Sachivalayam Employees Awards Amount Details in Telugu
- AP Grama Ward Sachivalayam Employees Awards Amount Hike
- ap grama ward sachivalayam amount hike
- ap grama ward sachivalayam amount award increasesed
- Andhra Pradesh Grama/Ward Sachivalayam Benefits
- Andhra Pradesh Grama and Ward Sachivalayam awards details in telugu
- Seva Ratna
- Seva Ratna Price Money News Telugu
- Seva Vajra Award Money
- Seva Vajra
- Seva Vajra Price Money Hike News in Telugu
- Seva Mitra award for Volunteers
- Seva Mitra award Price Money
- Seva Mitra award Price Money Awards
- AP CM YS Jagan Mohan Reddy
- AP CM YS Jagan
- AP CM YS Jagana Today News