Jagananna Amma Vodi: అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా.. ఏటా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
పేదరికంలో ఉన్న వారు చదివించేందుకు కూడా కష్ట తరంగా మారిన రోజలు నుంచి నేడు సగర్వంగా ప్రభుత్వ బడుల్లో విద్యాభ్యాసం చేసే స్థితికి వచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని జగనన్న అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు కింద వసతులు కల్పించడంతో పాటు ప్రయివేటు పాఠశాలల్లో చదువుకున్న వారికి కూడా ఫీజులు చెల్లించేలా తల్లుల బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం అమ్మఒడి కింద ఏడాదికి ఒకసారి రూ.15 వేలను ప్రభుత్వం అందిస్తోంది. దీంతో బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగింది. పేద,మధ్య తరగతి వారు తమ బిడ్డలకు ప్రభుత్వం మంచి భవిష్యత్తును కల్పిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Intermediate State Topper 2024 S. Nirmala : 2024 ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్ S.నిర్మల
చిల్లకూరు: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. నాడు–నేడు కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి రూపు రేఖలు మార్చేశారు. మన ఊరిలో కళ్ల ముందే బడి మారిందని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభుత్వ బడికే పంపడం మొదలు పెట్టారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థు సంఖ్య పెరగడంతో ప్రభుత్వం మరొక అడుగు మందుకు వేసింది. చదువుకునే చిన్నారి ఇంటిలో ఒకరికి అమ్మఒడి కింద నగదును తల్లుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని ప్రకటించింది. పాఠశాల ప్రారంభానికి ముందే తల్లుల ఖాతాలు నగదు జమ చేస్తోంది. దీంతోపాటు విద్యా కానుక కింద విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, బూట్లు బడి ప్రారంభ రోజునే అందిస్తోంది. బడికి వచ్చే చిన్నారికి రోజుకో మెనూ చొప్పున కోడిగుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారం అందజేస్తోంది. దీంతో చిన్నారులకు బడికి వెళ్లే సమయంలో ఇచ్చే ప్యాకెట్ మనీ కూడా తల్లిదండ్రులకు మిగిలి పోతుంది. చిన్నారికి ఏడాదిలో చదువుకు అవసరమైన అన్ని ఖర్చులకు అమ్మఒడి అండగా నిలు స్తోందని తల్లులు అంటున్నారు.
పేదరికాన్ని జయించేలా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక డ్రాపౌట్స్ తగ్గాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులతో కొందరు చదువుకు దూరమై బడి బయట పిల్లలు ఎక్కువగా కనిపించే వారు. వైఎస్సార్ సీపీ ప్రభు త్వం ఆర్థికభారం తగ్గించేందుకు అమ్మ ఒడిని ప్రవేశపెట్టి తల్లుల ఖాతాలో ఏటా రూ.13 వేలు జమ చేస్తోంది. దీంతో బడి బయట పిల్లలు సంఖ్య తగ్గింది. విద్యా కానుక పేరుతో విద్యా సామగ్రి, యూ నిఫాం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబెర్స్‌మెంటు ద్వారా అండగా నిలుస్తుండడంతో బడుగు, బలహీన వర్గాల వారు పేదరికంపై విజయం సాధిస్తున్నారు. జగనన్నకు రుణపడి ఉంటామని ఆనందంగా చెబుతున్నారు.
మండలం | స్కూళ్లు | లబ్ధి పొందిన తల్లులు | మొత్తం(రూ.లు) కోట్లలో |
గూడూరు | 89 | 35,523 | 53.01 |
చిల్లకూరు | 72 | 18,209 | 27.32 |
కోట | 77 | 17,794 | 26.69 |
వాకాడు | 72 | 12,611 | 18.91 |
చిట్టమూరు | 83 | 13,918 | 20.61 |
అవసరాలు తీరుస్తోంది
అమ్మఒడి నాలుగేళ్లుగా అందుకుంటున్నా. నా కు ఇద్దరు పిల్లలు. ఒకరు 8వ తరగతి, ఇంకొకరు నాలుగవ తరగతి. ఒకరికి అమ్మ ఒడి వస్తోంది. దీంతో ఇద్దరు బిడ్డల అవసరాలను తీర్చేకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి ఆదుకుంటుంది. ఇద్దరు పిల్లలకు బడిలోనే విద్యా కానుక అందుతోంది. తల్లిదండ్రులకు అమ్మఒడి ఆర్థిక ధైర్యాన్ని ఇస్తోంది. – చిట్టిజ్యోతి, తల్లి, సాదుపేట, గూడూరు
అమ్మకు తొలగిన ఇబ్బందులు
అమ్మఒడి కింద నగదును అమ్మల ఖాతాలో జమ కావడంతో చదువుల ఆర్థిక ఇబ్బందులు తొలగాయి. మూడేళ్లుగా మా అమ్మ బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉండడంతో బాగా చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడంతో పేదల
చదువుకు భరోసా ఏర్పడింది. – సీహెచ్ భాగ్యలక్ష్మి, విద్యార్థి, వాకాడు