రెన్యువల్‌కు ఆదాయ ధ్రువీకరణ మినహాయింపు
కోర్సులో ప్రవే శం పొందిన ఏడాది కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించే నిబంధన ఉండగా.. రెన్యువల్ సమయంలోనూ ‘ఆదాయ’ పత్రాన్ని సమరి్పస్తున్నా రు. ఈ నిబంధనతో దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమవుతున్న దృష్ట్యా ‘ఆదాయ’ పత్రం సమరి్పంచడాన్ని మినహాయించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నా యి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమరి్పంచేందుకు సన్నద్ధమయ్యాయి.
చదవండి:
Good News: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
ఆంధ్ర టూ అమెరికా.. రూ.కోటి స్కాలర్‌షిప్‌తో ఎంపిక
CBSE: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా..
ఏటా 7.5 లక్షల బాండ్ పేపర్ల కొనుగోలు
రాష్ట్రంలో ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యా ర్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో 5 లక్షల మంది ఫ్రెషర్స్ ఉంటుండగా.. 7.5 లక్షల మంది రెన్యువల్ విద్యార్థులు. ఫ్రెషర్స్‌కు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. రెన్యు వల్ విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ సమరి్పంచా ల్సి ఉంది. ఆదాయ ధ్రువీకరణ పత్రంతోపాటు బాండ్ పేపర్‌పై సెల్ఫ్ అఫిడవిట్ తయారు చేసి దరఖాస్తుతో జత చేయాలని కాలేజీ యాజమాన్యా లు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. బాండ్‌పేపర్ కొని సెల్ఫ్ అఫిడవిట్ ప్రింట్ తీయడం, ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తు ప్రక్రియ విద్యార్థుల జేబుకు చిల్లులు పడేలా చేస్తోంది. దీంతో ‘ఆదాయ’ పత్రాన్ని సమరి్పంచే పద్ధతికి స్వస్తి చెప్పి, తెల్ల కాగి తంపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చే విధానానికి సంక్షేమ శాఖలు మొగ్గుచూపుతున్నాయి. దీనివల్ల దరఖాస్తు విధానం సులభతరమై విద్యార్థులకు ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈమేరకు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు రూపొందించాయి. అతి త్వరలో దీనికి ప్రభుత్వ ఆమోదం దక్కనుందని, వచ్చే ఏడాది నుంచి మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.